టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ను ఓ ఇద్దరు పిల్లల తల్లి వేధిస్తోంది. దీనికంతటికి కారణం ప్రముఖ దర్శకుడు తేజనే. ఇంతకీ దర్శకుడు తేజకు, వెంకటేశ్‌కు ఇద్దరు పిల్లల తల్లితో ఉన్న సంబంధం ఏమిటి..? అన్న అంశంపై ఓ లుక్కేద్దాం.
గురు సినిమా హిట్‌తో నటుడు వెంకటేష్, నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో దర్శకుడు తేజ ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుంది. దగ్గుబాటి రాణాకు నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో మాంచి హిట్ ఇచ్చిన తేజ.. ఇప్పుడు వెంకటేశ్ ఖాతాలో కూడా ఓ హిట్ చిత్రాన్ని వేసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తగ్గట్టుగానే మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్ర కథను ఎంచుకుని.. తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేసేందుకు కథలో మార్పులు చేర్పులు కూడా చేశాడు దర్శకుడు తేజ.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం హీరో వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నారు. మరి హీరో ఇద్దరు పిల్లల తండ్రిగా నిపిస్తే.. హీరోయిన్ కూడా ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించాలి కదా..!! అక్కడే వచ్చింది సమస్య. ఇద్దరు పిల్లల తల్లిగా నటించేందుకు టాలీవుడ్లో ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోవడం లేదట. కాజల్, అతిథిరావ్, హైదరి, నిత్యామీనన్, నివేదా థామ్ వంటి హీరోయిన్లను దర్శకుడు తేజ సంప్రదించినా ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న గ్లామరస్ హీరోయిన్లను దర్శకుడు తేజ సంప్రదించినా (నో) అదే సీన్ మళ్లీ రిపీటైంది. దీంతో తేజ, వెంకటేశ్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కాస్త ఆలస్యమయ్యేట్టు ఉందే అంటూ టాలీవుడ్లో గాసిప్స్ స్ర్పెడ్ అయ్యాయి.