వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుండి తీవ్ర అవమానం జరిగింది. రాజమండ్రి కార్పోరేషన్ సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావుని గోరంట్ల నోటికొచ్చినట్టు తిట్టడంతో గందరగోళంగా తయారైంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ… తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. అయితే ఇదే విషయాన్ని గోరంట్ల కార్పొరేషన్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. తన నియోజకవర్గంలో నీకేం పని అని… నా నియోజకవర్గం పరిధిలోకి రాకుండా నీ పని నీవు చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను కూడా ఎమ్మెల్సీని అని.. తనకు కూడా నియోజకవర్గంలో పనిచేసే హక్కు ఉందని అప్పారావు కౌంటర్ ఇచ్చి మరీ రెచ్చిపోయారు.
దీంతో రెచ్చిపోయిన గోరంట్ల.. నీవెంత నీబతుకెంత.. రేయ్ కోసేస్తా అంటూ కేకలు వేస్తూ.. దూషించారు. పార్టీలో తాను ఎప్పటి నుంచో ఉన్నానని… నీలా ఫిరాయించి రాలేదని.. పార్టీలో నువ్వు ఉంటే ఉండు లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపో అని విరుచుకుపడ్డారు. ఇక తమ నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే చూస్తూ ఉండడానికి తాను, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేతగాని చవటలమనుకుంటున్నావా అంటూ అప్పారావు పై విరుచుకుపడ్డారు. ఇంతలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా గోరంట్లతో గొంతు కలిపారు. దీంతో ఒంటరైపోయిన అప్పారావు చేసేది ఏంలేక మౌనంగా ఉండిపోయారు. వైసీపీలో ఉన్నప్పుడు తనను చాలా గౌరవంగా చూసుకునే వారని.. చంద్రబాబును నమ్మకుని పార్టీ ఫిరాయించి చాలా తప్పు చేశానని.. తరచూ ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నాయని.. అప్పారావు సన్నిహితుల వద్ద వాపోయని సమాచారం.