కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన ప్రదాన ధ్యేయమని తెలిపారు.అలాగే స్వచ్చమైన మంచినీటిని నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ లోని నాయకులూ ,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.
see also :వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్పిన కేటీఆర్
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!