ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వం (బీజేపీ)తోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ) చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విధితమే. వామపక్షాలు చేస్తున్న ఈ బంద్‌కు వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను సైతం వామపక్షాల బంద్‌కు మద్దతు తెలిపే సందర్భంలో వాయిదా వేసుకున్నారు వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇటు చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచారని ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. అయితే, ఏపీ బంద్ సందర్భంగా వామపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనపై పాటరూపంలో ఒక్క ముక్కలే తేల్చేశారు.
ఆ పాటపై ఓ లుక్కేద్దాం రండి..
చంద్రబాబన్న చాలా మంచోడు..
చంద్రబాబన్న చాలా మంచోడు..
పిల్లనిచ్చినోడ్నే ముంచినోడు..
———–
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రమంటడు..
సంకలు కొడుతుంటడు..
2050లో స్వర్గమొస్తదంటడు..