తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ డెబ్బై యేండ్ల స్వాతంత్ర భారతంలో జరగని పలు అభివృద్ధి పనులు ఈ మూడున్నర యేండ్లలోనే జరుగుతున్నాయి .ఉమ్మడి రాష్ట్రంలో నలబై ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు.ఉద్యోగాలు లేక యువత తమ జీవితాలను నాశనం చేసుకునేవారు.కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా ఐటీ ,ఇతర కంపెనీల ఏర్పాటు చేయడం వలన యువతకు ఉపాధి కల్పించడం జరిగింది.ఎక్కడ లేని విధంగా రైతన్నకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం ..మిషన్ కాకతీయ వలన చెరువులు బాగుపడి పంటలు పండుతున్నాయి అని ఆయన అన్నారు . రాష్ట్ర ప్రజలే కేంద్రంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.పర్యటనలో సందర్భంగా నిజాంసాగర్,బిచ్కుంద మండలాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు .
see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!