ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర నుండి ఢిల్లీలో ఉన్న ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల వరకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి అని అంటున్నారు రాజకీయవర్గాలు.అసలు విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖ పట్టణానికి రైల్వే జోన్ లాంటి హమీలిచ్చి రాష్ట్రాన్ని విభజించిన సంగతి తెల్సిందే.
see also : గుండు కొట్టించుకున్న టీడీపీ ఎమ్మెల్యే
అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలను తుంగలో తొక్కాయి.అయితే నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ప్రత్యేక హోదాపై పలు మార్లు గల్లీ నుండి ఢిల్లీ వరకు ధర్నాలు రాస్తోరోకులు చేసింది.అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్లో ఏపీకి నిధులు తక్కువగా ఇవ్వడమే కాకుండా ఏకంగా విభజన హామీల గురించి ఊసే లేదు.దీనిపై నిరసనగా వామపక్షాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.గత ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న కానీ ఏ ఒకరోజు కూడా ఆఖరికి తనకు హెల్త్ సహకరించకపోయిన కానీ లెక్కచేయకుండా పాదయాత్ర చేసిన జగన్ రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడంతో తనకు ప్రజల సమస్యలే ముఖ్యమని వారి అభ్యున్నతే ముఖ్యమని చాటిచెబుతూ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఏపీ బంద్ లో పాల్గొన్నారు.
see also: దారుణం..14 ఏళ్ల అన్నయ్య 11 ఏళ్ల చెల్లితో శృంగారం
ఇక్కడే గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర నుండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ నేతల వరకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బంద్ నిర్వహించిన తీరు ప్రజలందర్నీ ఆకట్టుకున్నది.కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చారు.దీంతో ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంత ఉందో ఈ బంద్ లో చూపించారు.రానున్న రోజుల్లో ఇరు పార్టీలపై వ్యతిరేకత ఇంకా పీక్ స్థాయికి చేరుకుంటుంది.ఇది వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఏకంగా కాల్ చేసి బంద్ ప్రభావం ఎలా ఉందో వాకబు చేయడం జగన్ ప్రభావం ఎంత ఉందో అర్ధమవుతుందని..జగన్ ఇలా టైమింగ్ ను క్యాష్ చేస్కుంటే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..
see also : హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!