వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ వివాదాల వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. వివాదాలు, విమర్శలు, తిట్లు, నిరసనలు, ఆందోళనలు, కేసులు నేపథ్యంలోనే తన లేటెస్ట్ మూవీ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీపై మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైన ఆర్జీవీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉండటంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2’ మూవీ త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే…
see also..హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!
జీఎస్టీ-2(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)లో నటించేందుకు తాను సిద్ధమని యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా జీఎస్టీ-2లో నటిస్తానని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ఫాలోవర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ‘నటిస్తా.. కానీ డైరక్టర్ ఆర్జీవీ కాకుండా గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ పత్తారు అయితే సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అనంతరం మరో అభిమాని మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగారు. దానికి ఆమె ‘అవును.. ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. ఇక మొన్న అనసూయకు జరిగిన సంఘటనపై మీరన్నా అనసూయకు కొంచెం చెప్పండి. మీ ఇద్దరు స్నేహితులకు కదా అన్న నెటిజన్ ప్రశ్నకు ‘క్షమించండి.. నేను ఆమె సలహాదారుని కాదు’ అన్నారు.