రష్మి ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కామెడీ ప్రోగ్రామ్ యాంకర్ గా తెలుగు వారికీ సుపరిచితురాలు.తన మాటలతో ,అందాలను ఆరబోస్తూ ఏకంగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న హాట్ యాంకర్.అయితే తాజాగా ఆ కార్యక్రమంలో తన సహచర యాంకర్ అయిన అనసూయ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే.
హైదరాబాద్ మహానగరంలో తార్నాకలో సెల్పీ అడగటానికి వచ్చిన చిన్నపిల్లవాడ్ని కొట్టడమే కాకుండా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను లాక్కొని నేలకేసి కొట్టింది.ఈ వివాదంపై నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ పబ్లిక్ లో ఎలా ఉండాలో మీరైనా సరే అనసూయకి చెప్పండి అని ట్వీట్ చేశాడు.దీనికి స్పందించిన రష్మి నేను అనసూయ గార్డియన్‌ను కాదు అని రిప్లై ఇస్తూనే ఒక ఉదాహరణను వివరించింది.
ఈ నేపథ్యంలో “నేను షూటింగ్ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్ళుతున్న సమయంలో నలుగురు యువకులు తన కారును వెంబడించారు.అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారిని దారి మళ్లించిన కానీ మమ్మల్నే వెంబడిస్తూ వచ్చారు.ఆ సమయంలో కారు ఆపి వాళ్ళను నిలదీయగా సెల్పీ దిగితినే మిమ్మల్ని పోనిస్తామని లేకపోతే లేదని తేల్చి చెప్పారు .అదృష్టశావత్తు అటువైపుగా పెట్రోలింగ్ కారు రావడంతో వాళ్ళను పోలీసు వాళ్ళకు అప్పజెప్పాను అని ఆమె ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు .