ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత నియోజక వర్గాల పునర్వవ్యస్తికరణ నేపథ్యంలో నగరి నుండి 2004,2009 లో గెలుపొందారు.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా చేతిలో ఓడిపోయారు.అయితే గతంలో గాలి మూడు సార్లు మంత్రిగా పని చేశారు.ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాడు అని ఇటు తెలుగు తమ్ముళ్ళు ,అటు గాలి అనుచవర్గం అంటున్నారు.
ఎమ్మెల్యేగా ,మంత్రిగా జిల్లా ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఆయన చివరి దశలో తన జీవితాన్ని శ్రీవారి సేవలో గడపాలని ..అందుకు టీటీడీ చైర్మన్ గిరి ఇవ్వాలని చాలా సార్లు గాలి ముద్దుకృష్ణమ నాయుడు బాబును అడిగారు.అయితే తన రాజకీయాల కోసం గాలి విన్నపాన్ని తిరస్కరించారు.దీంతో అకాల మరణం పొందిన గాలి తన చివరి కోరిక తీరకుండా ఈ లోకాన్ని వీడారని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు.