బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి అనసూయ. రేష్మీ, శ్రీముఖి వంటి పెళ్లికాని యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా వెండి తెరపై తన ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అంటూ అనిపించుకుంటోంది అనసూయ.
ఇదిలా ఉండగా.. హాట్.. హాట్ అందాలతో బుల్లితెర తోపాటు వెండితెరను హీటెక్కించే అనసూయపై వచ్చిన రూమర్లు కోకొల్లలు. ఒక స్టార్ హీరోతో అనసూయ అక్రమ సంబంధం నెరుపుతుందని, అందులో భాగంగానే తన పిల్లలను భర్త వద్ద ఉంచి స్టార్ హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని, అందుకే అనసూయకు సినిమా అవకాశాలు పెరిగాయని సినీ జనాల అభిప్రాయం.
అయితే, మంగళవారం యాంకర్ కమ్ అనసూయ తన ఫోటోలు తీస్తున్నాడన్న అనుమానంతో ఓ బాలుడి చేతిలో ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను పగలగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్ సినీ ప్రపంచం అనసూయ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో టీవీ ఆర్టిస్ట్ వర్ష మాట్లాడుతూ.. అసలు నీవు తల్లివేనా..? అంటూ అనసూయను ప్రశ్నించింది. పర్ సపోజ్ అంటూ ఉదాహరణను చెప్తూ..
మీ పిల్లలకు నచ్చిన ఓ స్టార్ హీరో వచ్చినప్పుడు… ఆ స్టార్ హీరోతో ఫోటో దిగేందుకు మీ పిల్లలు కూడా ఆసక్తికనబరుస్తారు కదా..? ఒక వేళ అదే స్టార్ హీరో మీ పిల్లాడి సెల్‌ఫోన్‌ను పగలగొడితే నీవెంత ఫీలవుతావో ఆలోచించు. అలానే ఆ పిల్లాడు నీతో ఫోటో దిగాలనుకున్నాడు.. కుదరకపోతే.. కుదరని చెప్పు. అంతేకాని.. ఆ పిల్లాడ్ని కొట్టడానికి నీవెవరు అంటూ ప్రశ్నించింది. ఆ బాలుడి తల్లి ఎంత బాధపడి ఉంటదో ఒకసారి ఆలోచించు అంటూ సలహా ఇచ్చింది టీవీ నటి వర్ష.