ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం ..
విభజన చట్టంలో ఉన్న హామీలకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఉండటమే కాకుండా రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక ఫ్యాకేజీ కింద నిధులు ,రైల్వే జోన్ లాంటి విషయాలపై కేంద్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటు లో ఏపీ ప్రజల వాణిని వినిపించారు .ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్ళారు .
మరోవైపు రాజ్యసభలో కూడా వైసీపీ ఎంపీలు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడమే కాకుండా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఆవరణంలో గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేశారు.అయితే రాష్ట్ర విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని వైసీపీ ఎంపీలు పోరాడుతుంటే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీ పార్టీకి మిత్రపక్షమైన ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీలు తమకు ఏమి పట్టనట్లు కూర్చొని చూస్తుండటంపై ఏపీ నెటిజన్లు చేతకాని దద్దమ్మలాగా టీడీపీ ఎంపీలు సినిమా చూస్తుంటే వైసీపీ ఎంపీలు మాత్రం తెలుగోడి పవర్ చూపించారు అని నెటిజన్లు వైసీపీ ఎంపీలపై ప్రశంసల వర్షం కురిపించారు …