ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినా.. వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు ఇచ్చిన తాయిలాలకి అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు హ్యపీగా లేరనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీ రాజకీయాలని శాసించే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా వైసీపీ తరుపున సీటు సాధించారు. నాడు ఈ సీటుకు తీవ్రమైన పోటీ ఉన్నా.. జగన్ మాత్రం ఈ సీనియర్ నేత పై నమ్మకం ఉంచి ఆయనకు కట్టబెట్టారు. అయితే జగన్ నమ్మకాన్ని.. ఆది రెడ్డి అప్పారావు వమ్ము చేస్తూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు పిలుపుతో ఊపుకుంటూ వెళ్ళిన అప్పారావుకి ప్రస్తుతం టీడీపీలో ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయని సమాచారం.
ఇక రాజమండ్రి గ్రామీణ ప్రాతంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి-ఆదిరెడ్డి అప్పారావుకు గ్రీన్ గ్రాస్ వార్ జరుగుతోంది. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఆదిరెడ్డి.. తనను హైలెట్ చేసుకోవడానికి ఇతరుల పై లేనిపోనివి కల్పిస్తున్నాడని…చంద్రబాబు, లోకేష్‌లు తను ఏం చెబితే అదే చేస్తారని… ఆదిరెడ్డి చెబితే అమరావతిలో ఏదైనా జరిగిపోతుందని కూడా ఆయన తెగ ప్రచారం చేసుకుంటున్నారని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. తాము ఎంతో సీనియర్లమని, నిన్న గాక మొన్న పార్టీ మారిన వారం కాదని, చంద్రబాబు దగ్గర ఎవరికి ఎంత పలుకుబడి ఉందో ప్రజలకు తెలుసునని గోరంట్ల చెప్పుకొచ్చారు. ఈ పరిణామం ఇరువురు నేతల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది.
అయితే బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల పై స్పందించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి బూటకపు ప్రచారాలు చేసుకునే ఖర్మ తనకు లేదని… తాను ఇలా ప్రచారం చేసుకున్నట్టు ఆధారాలు ఉంటే చూపించాలని, లేదా తప్పు ఒప్పుకొని తీరాలని ఆయన సవాల్ చేశారు. అయితే ఆదిరెడ్డిక బుచ్చయ్య చౌదరితోనే కాకుండా ఇతర టీడీపీ నేతల నుండి కూడా సమస్యలు ఎదురవడంతో.. ఆదిరెడ్డి పురనాలోచనలో పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన మనసులో పార్టీ మారి తప్పు చేశానని.. నాడు చేసిన తప్పుకు.. నేడు తన ఖర్మ కాలిపోయిందని ఆయన మథన పడుతున్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఒక వేళ వివాదం ముదిరితే.. తిరిగి వైసీపీ గూటికే వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.