ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 2న ఏపీలో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వెంకట్రామపురంలో జి.రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఉన్నత చదువులను చదివి ..అధ్యాపక వృత్తిలో ఉండగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
see also : గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
ఆ తర్వాత పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి వరసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.మూడు సార్లు మంత్రిగా కూడా పని చేశారు.అయితే 2004లో టీడీపీలో కుట్రలను తట్టుకోలేక పార్టీ మరి 2004 నగరి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి ఓడిపోయిన ఆయన్ని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీను చేశారు.అయితే ఆయన ముందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
see also : దట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..!!
ఆయన అనారోగ్యానికి గురి కావడానికి ముందు ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు అని ఇటు కుటుంబ సభ్యులు ,అటు గాలి అనుచరవర్గం చెబుతున్నారు.రానున్న ఎన్నికల్లో డెబ్బై శాతం మందికి ఎమ్మెల్యే సీటు ఇవ్వను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చిన సంగతి తెల్సిందే.అయితే గాలి ఎన్ని సార్లు అడిగిన కానీ వచ్చే ఎన్నికల్లో తనకు సీటుపై ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు అని తెలుగు తమ్ముళ్ళు గుస గుస లాడుతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యానికి కారణం మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు..తాజాగా బీపీ కంట్రోల్ లేని స్థితిలో ఆదివారం ఆయనను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు…రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్ వైద్యుడు డాక్టర్ కళాధర్ తెలిపారు…
see also : బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ …నా భర్త చూశాడు..యాంకర్ శ్యామల
see also : నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట..!!