కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ర్టీలో తన జోరును మళ్లీ పెంచింది. మెగా హీరోలు చిరంజీవితో ఖైదీ 150, అంతకు ముందు పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో నటించిన ఈ భామ నేనే రాజు.. నేనే మంత్రి చిత్రంలో రాణాతో జత కట్టిన విషయం తెలిసిందే. అలాగే, కాజల్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. క్వీన్ తమిళ్ రీమేక్ పారిస్.. పారిస్ చిత్రంతోపాటు, నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎమ్మెల్యే చిత్రంలోనూ కాజలే హీరోయిన్. అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయింది. నూతన దర్శకుడు నాని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కథ నచ్చడంలో ఒప్పుకుందట కాజల్ అగర్వాల్.