టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ రష్యా దేశానికి చెందిన ఒక యువకుడితో వివాహం జరగనున్నది.ఎప్పటి నుండో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు.ఇటివల శ్రియ కుటుంబ సభ్యులు రష్యా దేశానికి వెళ్లి వీరిద్దరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చే నెలలో వివాహం జరగనున్నది .దానికి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లతో పాటుగా పెళ్లికి సంబంధించి షాపింగ్ కూడా చేయడం జరిగిందని వార్తలు వచ్చాయి .అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై శ్రియ మీడియాతో మాట్లాడారు .ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు .
తన స్నేహితురాలి వివాహం గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందుకు తగ్గట్లు షాపింగ్ కూడా చేయడం జరిగింది అని ఆమె తెలిపారు .అయితే పెళ్లి పై వివరణ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్యాన్ యువకుడి గురించి కానీ ప్రేమ గురించి కానీ స్పందించకపోవడం వెనక శ్రియ ప్రేమలో ఉన్నట్లు ..పెళ్లి కూడా చేస్కోబోతున్నారు అని వచ్చిన వార్తలు నిజమే అని సినీ వర్గాలు అంటున్నాయి .