గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ర్టీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వార్త.. మెగా డాటర్ నిహారిక పెళ్లి వార్త. త్వరలోనే యువ కథానాయకుడు నాగశౌర్య మెగా అల్లుడు కాబోతున్నాడని, అందుకు సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారంటూ రక రకాల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. నాగశౌర్య నటించిన ఛలో చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో రెచ్చిపోయి మరీ నాగశౌర్య, నిహారికల పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు గుప్పించారు .
ఈ విషయంపై నాగశౌర్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్నేహితుడు ఈ వార్త గురించి చెప్పాడని, అది అంత వట్టి పుకారని .. తానెలా పెళ్లి చేసుకుంటానని ఎదురు ప్రశ్నించడమే కాకుండా మరో మూడు నాలుగేళ్లలో తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య. ఏదేమైనా ఈ పెళ్లి వార్తలపై నాగశౌర్య స్పందించి సగం క్లారిటీ ఇచ్చేశాడు… నిహారిక కూడా క్లారిటీ ఇస్తే కన్ఫూజన్‌కు తెరపడినట్లుగా ఉంటుంది కదా..!! అంటున్నారు సినీ జనాలు. మరి నిహారిక ఈ వార్తలపై స్పందిస్తుందో..? లేదో..?