వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.. ఈ నెల 18న 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో పెళ్లి జరగనుంది. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు. త్వరలో పెళ్లి ఉండటంతో ఈ మేరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ఈనెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు కలెక్టర్ సెలవుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ తీసుకోనున్నారు. ఇక పెళ్లి పూర్తయ్యాక ఈ నెల 22 నుంచి 25లోపు ఏదైనా ఒక తేదీలో హైదరాబాదులో వివాహ రిసెప్షన్ వుంటుందని టాక్. అనంతరం 26న భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నట్లు సమచారం.
see also..బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ …నా భర్త చూశాడు..యాంకర్ శ్యామల
ఇకపోతే.. ఆమ్రపాలి తండ్రి కాట వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. సివిల్స్లోలో 39వ ర్యాంకు సాధించిన ఆమ్రపాలి.. సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ సర్కారు ఆమెను వరంగర్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. యంగ్ కలెక్టర్ అయిన ఆమ్రపాలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ యువతకు దగ్గరయ్యారు.