ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు .రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని విపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .
దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పాదయాత్రకు కూడా విరామం ప్రకటించారు.దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రేపు విపక్షాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు ,అధికారులకు ఆదేశించాను.అయితే జగన్ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో కోట్లడాలని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు ..