దేశంలో ఎక్కడ బడితే అక్కడ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకునిపోయి బడి, గుడి అనే తేడాలేకుండా ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, అతను రావడంలో జాప్యం జరిగింది. దీంతో స్థానికంగా ఉండే బస్టాప్‌లో కూర్చుంది. అమ్మాయిని గమనించిన ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి.. ఇక్కడ మీరు ఉండడం అంత సేఫ్ కాదని.. సమీపంలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోమని సలహా ఇచ్చాడు. గుడి అనాగానే దేవుడి సన్నిదిలో నాకు ఇంకా భయం ఉండదులే అని పాపం ఆ అమ్మాయి నమ్మి గుడిలోపలికి వెళ్లింది.
SEE ALSO..ఓ బాలుడు రోడ్డు పక్కన యాంకర్ అనసూయ కనిపించగానే..ఏం చేశాడో తెలుసా..!
ఆ అజ్ఞాతవ్యక్తి తన ఇద్దరు స్నేహితులకు సైగ చేయడంతో వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. ఈ ఘటన నుంచి తేరుకున్న ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రేప్ చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. సంజయ్ పటేల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.