వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 82వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో 82వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్ రోడ్డు, తలుకురుపాడు క్రాస్ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. హసనాపురం ఎంట్రెన్స్ చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ అక్కడ మైనార్టీలతో సమావేశమవుతారు. అనంతరం హసనాపురం మీదుగా దుండిగామ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి అక్కడే బసచేస్తారు.
see also : ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!
see also : చిన్నాన్నతో అక్రమ సంబంధం..కారణం తెలుసా….!