Home / SLIDER / సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వినోద్ సూచన

సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వినోద్ సూచన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ను స్వాగతిస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే ఈ బడ్జెట్‌ లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారే తప్ప..అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదన్నారు. ఇవాళ జరిగిన లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడిన ఎంపీ వినోద్‌..2022 నాటికి రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌ సభకు వివరించారు. ఎకరానికి 8 వేల రూపాయలు, మిషన్‌ కాకతీయ ద్వారా నీటి లభ్యతకు చేస్తున్న ప్రయత్నాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ లకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

see also : చిరంజీవి పై సంచలన ట్వీట్ చేసిన కత్తి మహేశ్‌..!

see also : ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat