ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు బలవన్మరణం పాలయ్యారు. లక్ష్మిదేవి అనే మహిళ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరికీ వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు.
నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి (30)కి 13 ఏళ్ల క్రితం కొత్త సింగనమల గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం నర్సింహులు గల్ఫ్ వెళ్లాడు. ఈ క్రమంలో లక్ష్మీదేవ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుత (41)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కడప శ్రీనివాసులుకు కూడా పెళ్లయి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వారిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు రోజుల క్రితం వారిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. లక్ష్మీదేవికి సంబంధించినవాళ్లు కేసు పెట్టడంతో ఆదివారం తిరిగి ఇంటికి వచ్చారు. అవమానం పాలు కావడంతో మనస్తాపానికి గురై ఇరువురు కూల్ డ్రింక్‌లో విషపు గుళికలు వేసుకుని తాగారు. వారిద్దరిని అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే లక్ష్మీదేవి మరణించగా, ఆ తర్వాత కొద్ది సేపటికి నర్సింహులు మరణిచాడు.