ఈ మద్య అక్రమ సంబంధాలు వీపరితంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాటిని అరికట్టవలసిన వారు…అపాల్సిన వారు, న్యాయం చేయ్యవల్సిన వారు పోలీసులు..కానీ వీరే అత్యదికంగా అక్రమ సంబంధాలు పెట్టుకోని అడ్డంగా దొరుకుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు డీల్ చేసిన ఎఎస్పీ..సీఐ అక్రమ సంబంధం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ కానిస్టేబుల్ అక్రమ సంబంధం ఆరోపణలతోఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలాలికి చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్(28) మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్నాడు. సందీప్‌కు శంషాబాద్‌కు చెందిన ఓ వివాహిత పరిచయమైంది. కొద్దికాలానికి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పార్క్ లు, రిసార్ట్స్ వంటి ప్రదేశాలలో తిరిగి ఎంజాయ్ చేశారు. ఇది గమనించిన వివాహిత భర్త నాగార్జున మందలించి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సందీప్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఈ రోజు ఉదయం మౌలాలి రైల్వే ట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
