ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైయ్యింది. అసలు ఎటువంటి న్యాయం చేయ్యలేదు.. విశాఖ రైల్వే జోన్ ..కడప స్టీల్ ప్లాంట్ ..ప్రత్యేక హోదా ఇలా ఎన్నో సమస్యలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు. దీంతో ఏపీలో నిరసనలు ,దర్నాలు, బంద్ లు జరుగుతున్నాయి. అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ నాయకత్వం ఏమీ సాధించలేకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌పై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. బడ్జెట్‌లో ఏపీపై బండను తీసి గుండు పెట్టినట్టుగా ఉందన్నారు.
పంగనామాలు పెట్టేశారన్నారు. బడ్జెట్‌లో మంచి ఇంగ్లీష్ వాడారని కితాబిచ్చారు. చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా అని ప్రశ్నించగా.. చంద్రబాబు ఖర్చుల సంగతి తెలిస్తే అప్పుడు చెప్పవచ్చన్నారు. చంద్రబాబు ఒక నిదానమైన వ్యక్తి అని.. ఆలోచించి అడుగు వేసే వ్యక్తని చెప్పారు. ఆ ఆలోచన మరీ ఎక్కువైపోయిందని సెటైర్ వేశారు జేసీ. అంతా చంద్రబాబు మీదకు తోసేస్తున్నారేంటని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు మీదకు తోసేయక ఏం చేయాలోచెప్పండి అంటూ ఎదురుప్రశ్నించారు. ఎంపీలకు తెగింపు ఉందని కానీ చంద్రబాబు నిదానమైపోయారన్నారు. నాలుగేళ్లలో ఎంపీలుగా తాము సాధించింది ఏమీ లేదని జేసీ చెప్పారు.