జబ్బర్ దస్త్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
జబర్ధస్త్ యాంకర్ అనసూయ నగరంలోని తార్నాక ప్రాంతానికి వెళ్లారు. తన తల్లితో కలిసి అటువెపుగా వెళుతున్న ఓ బాలుడు రోడ్డు పక్కన అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లాడు. అభిమానంతో ఆమెతో సెల్పీ తీసుకోవాలనుకున్నాడు. వెంటనే తన మొబైల్ తీసి ఫొటో తీసుకునేందుకు యత్నించగా.. ఇది గమనించిన నటి అనసూయ ఆవేశానికి లోనై బాలుడి ఫోన్ను లాక్కుని నేలకేసి కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి అనసూయతో వాగ్వాదానికి దిగింది. తన కొడుకు ఫోన్ ఎందుకు పగలగొట్టావంటూ ప్రశ్నించగా. అనసూయ రుబాబు చేస్తూ సమాధానం చెప్పకుండ, దుర్భాషలాడుతూ కారెక్కి వెళ్లిపోయిందని ఆ బాలుడి తల్లి తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది