ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలని వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ అన్నారు.చదువుల విప్లవం ఆవశ్యకతపై ఇవాళ ‘జగన్ స్పీక్స్’ద్వారా తన పేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు.
మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలి. అది ఎలా సాధ్యం అన్నదాని పై నా ఆలోచనలు#JaganSpeaks
Posted by YS Jagan Mohan Reddy on Monday, 5 February 2018
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సాంకేతిక విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముష్టి వేస్తుందని, ఉత్తమ విద్యను అందించే కళాశాల్లో ఫీజులు రూ. లక్ష వరకూ ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సరైన సమయానికి అందటం లేదని విద్యార్థులు వాపోతున్నారని చెప్పారు. తక్కువ ఫీజును రీయింబర్స్ చేస్తే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారని ప్రశ్నించారు. చదువుల విప్లవాన్ని తీసుకురావాలని, అది కచ్చితంగా విజయవంతం అవుతుందని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
see also : తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!
see also : 79 రోజులు.. 1000 నాటౌట్.. జగన్ పాదయాత్రకు ముహుర్తం పెట్టింది ఎవరు..?
see also : 35 వేలకోట్లు ఎక్కడ.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్రముఖ నేత..!