Home / ANDHRAPRADESH / ఏపీలో దారుణం… ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త

ఏపీలో దారుణం… ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త

ఏపీలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వరకట్న కేసులు, దోపిడిలు, మహిళల కొసం నిర్భయలాంటి చట్టాలు ఉన్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని ప్రేమించి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఈ వ్యక్తికి గతంలోనే వివాహమైంది. మొదటి భార్యకు విడాకులిచ్చి.. ప్రశాంతిని పెళ్లి చేసుకున్నాడు.

రెండేళ్ల క్రితం వీరిద్దరికి మగబిడ్డ పుట్టాడు. మళ్లీ ఈ ఏడాది జనవరి 28న పండంటి ఆడబిడ్డకు ప్రశాంతి జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టిందని రాజారత్నం.. ప్రశాంతిని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. ఫిబ్రవరి 1న నిద్రపోతున్న ప్రశాంతి చేతికి విద్యుత్ వైర్లు చుట్టి స్విచ్ వేశాడు. కరెంట్ షాక్‌తో తేరుకున్న ప్రశాంతి గట్టిగా కేకలు వేసింది. ప్రశాంతికి ముఖం, చేతిపై గాయాలు ఉన్నాయి. కరెంట్ షాకిచ్చిన భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుక్నున పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat