Home / MOVIES / ‘స్కార్ఫ్’ కట్టుకునే ట్రెండ్ ఎవరు సెట్ చేశారో తెలుసా ..?

‘స్కార్ఫ్’ కట్టుకునే ట్రెండ్ ఎవరు సెట్ చేశారో తెలుసా ..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అమ్మాయిలు మొదలు పెళ్ళైన మహిళల వరకు తమ మొహాలకు స్కార్ఫ్ లేనిదీ బయటకు రారు.ఉదాహరణకు ఒక లవర్ తన లవర్ తో బైక్ మీద పోవాలన్నా ..లేదా ఎండకు మొహం పాడవ్వకుండా ఉండాలన్న కానీ స్కార్ఫ్ కట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఈవిధంగా ఫ్యాషన్ ఎవరు సెట్ చేశారో తెలుసా ..?.

ఇటివల మరణించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,తన స్వరంతో నటనతో అభినయంతో అందంతో తెలుగు ,తమిళ ,కన్నడ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కృష్ణకుమారి స్కార్ఫ్ కట్టుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశారు.అసలు విషయానికి వస్తే అప్పట్లో ‘చదువుకున్న అమ్మాయిలు అనే మూవీ లో కృష్ణకుమారి స్వర్గీయ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు జోడిగా నటించారు.

ఆ సినిమాలో ఒక సాంగ్ చిత్రీకరణ సమయంలో నటి కృష్ణకుమారికి పన్ను నొప్పి రావడంతో తన బుగ్గ బాగా వాసింది.అయిన కానీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కృష్ణకుమారి ఆ సాంగ్ చిత్రీకరణ సమయంలో మొహానికి స్కార్ఫ్ కట్టుకొని డాన్స్ చేశారు.అంతే అక్కడ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఆ ట్రెండ్ ను తెలుగు వాళ్ళు పాటిస్తున్నారు అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.ఇది అన్నమాట అసలు ముచ్చట

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat