వైసీ పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్ట్టిన ప్రజాసంకల్పయాత్ర 81వ రోజుకు చేరుకుంది .ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ( మంగళవారం ) ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్‌రోడ్డు, గాంధీ జన సంఘం మీదుగా పల్లెపాలెం క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. పల్లెపాలం మీదుగా సంగం శివారు చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
see also : 79 రోజులు.. 1000 నాటౌట్.. జగన్ పాదయాత్రకు ముహుర్తం పెట్టింది ఎవరు..?
see also : 35 వేలకోట్లు ఎక్కడ.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్రముఖ నేత..!
see also :బాబు సర్కారుకి బిగ్ షాకిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ..