తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలపై అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నసంగతి తెలిసిందే..ఈ క్రమంలో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందుకుగాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్‌ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. రాబోయే నాలుగు నెలలపాటుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు జరుగబోతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారంలో క్యాడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి పార్టీ నాయకులను సంసిద్ధులను చేస్తున్నారు. మొదట రైతు సమన్వయ సమితులు, ఆ తర్వాత పాస్‌పుస్తకాల పంపిణీ, మే నెలలో రైతులకు పెట్టుబడి పథకం అమలు కానున్నది. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్రస్థాయిలో మహాసభలు జరుగనున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో వచ్చే వారం, పది రోజుల్లో పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర పార్టీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
see also : 21,000 వేతనం…ఏఎన్ఎంలకు సీఎం కేసీఆర్ తీపికబురు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా రైతు సమన్వయ సమితి సదస్సులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రైతులను సంఘటితపరుచడానికి ఏర్పాటుచేసిన సమన్వయసమితి సదస్సుల్లో ఇప్పటికే గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తయింది. కొన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఇంకా కొన్నింటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. వాటన్నింటిని పూర్తి చేసి రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని జాబితాలను పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. పాత జిల్లాల ఆధారంగా రెండుమూడు జిల్లాలకు కలిపి ఒక ప్రాంతంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులకు గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితుల బాధ్యులను ఆహ్వానిస్తారు. అనంతరం హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో సమన్వయ సమితి అన్నిస్థాయిల సభ్యులతో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో సీఎం కేసీఆర్ వారి బాధ్యతలు, విధులపై దిశానిర్దేశం చేయనున్నారు.
see also : రాహుల్ గాంధీ సర్వేలో జగన్‌కు షాకింగ్ రిజల్ట్..! ఎవరెవరికి ఎన్ని సీట్లు..!!