ఏపీ ముఖ్యమంత్రి 2014 లో అమలు కాని హామీలు ఇచ్చి అదికారంలోకి వచ్చారు అని వైసీపీ నాయకులు అంటుంటే… ఆయన కొడుకు మాత్రం ఈ సారి ఏపీలో కాదు అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఈ వాఖ్యలు చేశారు . కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ ‘మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోంది’అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. అనేక ఉద్యోగాలు..పరిశ్రమలు ఏపీకి వస్తాయాని మంత్రి అన్నారు. అయితే ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. 2019లో ఏపీలోను అదికారంలోకి వచ్చే అవకాశం లేకపోతే…ఇక అమెరికాలో ఎలా వస్తాదోనని వైసీపీ నేతలు అంటున్నారు.
