అమరావతిలో జరిగిన తెలుగుదేశం ఏంపీలా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.కేంద్ర బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు. ప్రజలలో దీనిపై విపరీతమైన నిరసన వ్యక్తం అవుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్ళ తర్వాత బడ్జెట్ లో న్యాయం జరగకపోతే ఏమి చేయాలని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చే నిదులతో పాటు అదనంగా ఏపీకి ప్రత్యేకంగా ఇవ్వాలని కోరానని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారని మీడియాలో వార్త వస్తోంది.తాము నియోజకవర్గాల పెంపు గురించి పట్టుబట్టడం లేదని, విభజన చట్టంలో ఉంది కనుక అడుగుతున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో గట్టిగా మాట్లాడవద్దని ఆయన సూచించారు.కేంద్ర బడ్జెట్ బాగోలేదని అంటున్న చంద్రబాబు మద్యలో జగన్ నాటకాలు ఆడుతున్నారని అనడం చిత్రంగానే ఉంది. అయితే ఆయన ఆడాలి. లేదా ప్రదాని మోడీ ఆడాలి. మధ్య లో జగన్ గొడవ ఎందుకబ్బా! అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కామెంట్ల్ తో రెచ్చిపోయి హల్ చల్ చేస్తున్నారు.
