అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలికలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈరోజు సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
see also : డబుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
15 వేలకు మించి జనాబా ఉన్న పంచాయితీలను ఖచ్చితంగా నగర పంచాయితీలు, మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎమ్మెల్యేలకు తెలిపిన మంత్రి కేటీఆర్ వాటి ఎర్పాటు చేయడం కోసం పరిసర ప్రాంతాలను కలపడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. నూతన పురపాలికల ఎర్పాటు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. పురపాలికలను ఏర్పాటు చేసిన తర్వతా కనీసం రెండు సంవత్సరాల పాటు పన్నుల పెంపు ఉండబోదన్నారు. దీంతోపాటు నూతన పురపాలక సంస్ధలకు నిధులను సైతం అందిస్తామన్నారు. నూతనంగా పురపాలక సంస్ధలు ఎర్పాటు చేయడం ద్వారా అయా ప్రాంతాల అభివృద్ది వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ద్వారా రాబోయే జనాభాను సైతం ఈ ప్రక్రియలో పరిణనలోకి తీసుకోవాలన్నారు.
see also : యూనివర్సిటీల్లో 1551 పోస్టుల భర్తీకి సీఎం కేసిఆర్ ఓకే
ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు లోపల 167 గ్రామాలున్నాయని, వాటి భౌగోళిక పరిస్దితులను బట్టి నూతన పురపాలక సంస్ధలుగా ఎర్పాటు చేయడం, ఇతర పురపాలికల్లో వీలీనం చేయడం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారుల నివేధికలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్ధితులకు అనుగుణంగా స్ధానిక ప్రజా ప్రతినిదులు కలిసి నూతన పురపాలికలకు ప్రతిపాధనలివ్వాలన్నారు. ఈ మేరకు స్ధానిక ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని కలెక్టర్లను మంత్రి అదేశించారు. అమీన్ పూర్, బొల్లారం, కొంపల్లి, పుప్పాలగూడా, ప్రగతి నగర్, తెల్లాపూర్, కొల్లూర్, తుర్కంయాజాల్ లతో పాటు మరికొన్ని మున్సిపాలీటీలను ఏర్పాటు చేయడం పైన ఈ సమావేశంలో చర్చించారు.
see also : 35 వేలకోట్లు ఎక్కడ.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్రముఖ నేత..!
see also : తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!