Home / TELANGANA / డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క స‌మావేశం

డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క స‌మావేశం

 పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌విష‌యంలో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ మ‌రో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.  తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డ లేని విధంగా నిరుపేద‌ల‌కు నాణ్య‌త‌తో కూడిన విశాల‌మైన రెండు ప‌డ‌క గ‌దుల‌ను నిర్మిస్తుంద‌ని, ఇంత‌టి మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి సామాజిక బాధ్య‌తగా  సిమెంట్ కంప‌నీలు తోడ్పాటునందించాల‌న్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం స‌చివాల‌యంలో ఉక్కు కంప‌నీల యాజ‌మాన్యాల‌తో  స‌మావేశ‌మ‌య్యారు.

డ‌బుల్  తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెండ్ రూం ఇండ్ల ప‌థ‌కానికి సామాజిక బాధ్య‌త‌గా ఉక్కు కంప‌నీ యజ‌మానులు త‌మ వంతు స‌హాయం చేయాల‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సిమెంట్ కంపనీలు మార్కెట్ లో హెచ్చు త‌గ్గుల‌తో సంబంధం లేకుండా బ‌స్తా సిమెంట్ ను రూ.230కే విక్ర‌యిస్తున్నార‌ని, ఉక్కు కంప‌నీ యాజ‌యాన్యాలు కూడా త‌క్కువ రేట్ కు ఉక్కును విక్ర‌యించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మొత్తం 2.60 ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో (ల‌క్ష ఇండ్లకు) 1.45 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, ప‌ట్ణణ ప్రాంతాల్లో (60 వేల ఇండ్ల‌కు) 1.04 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ( ల‌క్ష ఇండ్ల‌కు) 2.78 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నులు (మొత్తం 5.27 లక్ష‌ల మెట్రిక్ టన్నులు)  ఉక్కు అవ‌స‌రం ఉంద‌ని కంప‌నీ యాజ‌మాన్యాల‌కు మంత్రులు తెలిపారు.

see also : 35 వేల‌కోట్లు ఎక్క‌డ‌.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్ర‌ముఖ నేత‌..!

తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని,  ఉక్కు విక్ర‌యించిన కంప‌నీల‌కు ఎలాంటి జాప్యం లేకుండా ఆన్ లైన్ లో బిల్లుల చెల్లింపులు ఉంటాయని వారికి మంత్రులు స్ప‌ష్టం చేశారు. లాభ‌పేక్ష‌తో కాకుండా  సానుకూల దృక్ప‌ధంతో రీజ‌న‌బుల్ రేట్ కు ఉక్కును విక్ర‌యించాల‌న్నారు.  దీనిపై అన్ని ఉక్కు కంపనీల‌ యాజ‌మాన్యాల‌తో చ‌ర్చించి ప్ర‌భుత్వానికి త‌మ నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌ని ఉక్కు కంప‌నీల యాజ‌మాన్యాలు తెలిపాయి. ఈ విష‌యంపై  అధికారుల‌తో మ‌రోసారి భేటీ కావాల‌ని మంత్రులు స్టీల్ కంప‌నీల యాజ‌మాన్యాల‌కు తెలిపారు. ఉక్కు కంప‌నీల యాజ‌మాన్యాల‌తో రెండు మూడు రోజుల్లో మ‌రోసారి స‌మావేశ‌మై నిర్ధిష్ట‌మైన ధ‌ర‌ను (బేస్ రేట్) నిర్ణ‌యించాల‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కేటీఆర్ గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ చిత్రా రామ‌చంద్ర‌న్ ను ఆదేశించారు.

see also : యూనివ‌ర్సిటీల్లో 1551 పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసిఆర్ ఓకే

see also : వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారు… చంద్రబాబు నాయుడు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat