కువైట్‌లో అక్రమవలసదారులుగా ఉన్నవారికి క్షమాభిక్ష ప్రకటిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయకారిగా ఉంటుందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ కేటీఆర్ స్పష్టం చేశారు. కువైట్‌లోని ఎన్నారైలను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ పట్ల గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్&కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్కురి బసంత్ రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సారథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ సహాయం ప్రశంసనీయమని, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖతో చర్చిస్తున్నామని తెలిపిన మంత్రి కేటీఆర్…అవసరమైతే కువైట్ వెళ్తానని హామీ ఇచ్చినట్లు బసంత్ రెడ్డి తెలిపారు.
see also : డబుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
see also : యూనివర్సిటీల్లో 1551 పోస్టుల భర్తీకి సీఎం కేసిఆర్ ఓకే
see also : అవుటర్ లోపల కొత్త మున్సిపాలిటీలు..ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్