హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెనక నుండి వచ్చి లారీ ఢీ కొట్టిన వీడియో లో అసలు ఈ దారుణం చూడలేం…ప్రమాదలపై ఎన్ని సార్లు జాగ్రత్తలు చెప్పేన వాహన దారులు పాటించడంలేదు. పాటించండి ఈ లాంటి సంఘటనలు మళ్లి జరగకుండా ఆలోచించండి.
Tags hyderabad lorry road accident scooty