తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడమే కాకుండా రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతు బజారు భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు రైతు బజారును ఏర్పాటు చేశారన్నారు.ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ రెండు, మూడు నెలల్లో తేబోతున్నామని తెలిపారు.మొత్తం రూ.50కోట్లతో సిద్ధిపేటకు రింగు రోడ్డు సిద్ధిపేటకు మూడు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరాను . సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకురావడం.. సిద్ధిపేట జిల్లా కేంద్రం పూర్తయ్యింది.రైలు పనులకు సంబంధించి త్వరలోనే టెండర్ పనులకు శంకుస్థాపన చేసుకోనున్నామని తెలిపారు.ఈ మార్కెట్ లో మానవత్వపు గదిని ఏర్పాటు చేశాం. ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశాం.అవసరమైన వారు తీసుకోండి. ఉన్న వాళ్లు పెట్టి వెళ్లండి.మనిషికి ఒక్కటే పుట్టుక.. పది మందికి జీవితాన్ని పంచండి అని మంత్రి అన్నారు.
see also : తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!
see also : సంచలనం సృష్టిస్తున్న “జురాసిక్ వరల్డ్” న్యూ ట్రైలర్