ఇటివల జరిగిన అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో యువభారత్ ఆసీస్ పై ఘనవిజయం సాధించి నాలుగో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది.
తాజాగా అండర్ 19 టీం ఇండియా కెప్టెన్ అయిన పృథ్వి షాకు ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్నీ ఎంసీఏ అధ్యక్షుడు ఆశిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు .అయితే ఇప్పటికే ఐపీఎల్ ఆటగాళ్ళ వేలంలో రూ .1.2 కోట్ల రూపాయలతో పృథ్వి షాను కేకేఆర్ దక్కించుకుంది.