తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి ఇష్టమైన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసు గెలచుకున్న చిరంజీవి ప్రజా సేవ చేయాలన్న సంకల్పతో ప్రజారాజ్యం పార్టీని స్తాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురితో కలిసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ తీరువల్లే ప్రజా రాజ్యం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని పలువురి వద్ద చిరంజీవి వాపోయిన విషయం తెలిసిందే. సొంత తమ్ముడే పార్టీని నమ్మకుండా పోయినందునే.. ఇతరులు కూడా ఒక్కక్కరుడా ప్రజా రాజ్యం పార్టీని వీడారని అప్పట్లో సోషల్ మీడియాలో కూడా ఓ వార్త హల్‌చల్ చేసింది.
See Also:వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. అందుకు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయించారు కూడాను. అయితే, ఆ రాజ్యసభ సీటు గడువు మరికొన్ని నెలల్లో ముగియనుంది. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు చిరంజీవితోపాటు రేణుకా చౌదరి, ఆనంద్ భాస్కర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా చిరంజీవికి కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం లేదు. రాజ్యసభకు రీ నామినేట్ చేయకపోతే.. చిరంజీవి సినీ ఇండస్ర్టీకే పరిమితం కానున్నారు. అటు దేశ రాజకీయాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఇటు ఏపీలోనూ కాంగ్రెస్ చతికిలబడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న చిరంజీవి కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయం త్వరలో అధికారికంగా విడుదలకానుంది.
See Also:వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…