సినీ ఇండస్ర్టీలో ఏది జరిగిన హాట్ టాపకి మారుతుంది. చిన్నవయసులోనే అక్కినేని అఖిల్.. వయసులో తనకంటే పెద్దదైన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో బాగంగానే ఇద్దరికి ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చితార్ధం కూడా చేశారు. మరి అంతలో ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలు వచ్చాయో తెలీదు కానీ.. ఇద్దరూ విడిపోయారు. దీనికి కారణం అఖిల్ వ్యవహార శైలే కారణమంటూ సోసల్ మీడియాలో వార్తలు కూడా హల్‌చల్ చేశాయి.
ఇదిలా ఉండగా అఖిల్‌ను దెబ్బకు దెబ్బ కొట్టిన ఉపాసన అన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాడు అఖిల్, శ్రియా భూపాల్‌ను కలిపేందుకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తీవ్రంగా ప్రయత్నించిందని, అయినా కూడా వారిద్దరూ ఎంతకు కలవక పోవడంతో చివరకు చేసేది లేక తన కజిన్‌తోనే శ్రియా భూపాల్ పెళ్లిని కుదర్చిందట ఉపాసన. అంతేకాకుండా ఉపాసన కజిన్ ఆస్తులు… శ్రియా భూపాల్ కుటుంబం ఆస్తులు సరితూగడంతో ఈ పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే వీరి పెళ్లి డేట్‌ను ఎనౌన్స్ చేస్తారని, పారిశ్రామిక వేత్తలతోపాటు.. సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని టాలీవుడ్ టాక్.