ప్రస్తుతం ఈ రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు అయిపోయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఈలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. అయితే ఓటుకు డబ్బులివ్వడం అనేది ఇంత విస్తృతంగా ప్రజల్లో నానిపోయిన తర్వాత.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారం కోసం టీడీపీ నేతలు డబ్బులు పంచుతారని ప్రజలు అనుకోవడంలో వింతేమీ లేదు.
see also.. తట్టుకోలేక ఓ అమ్మాయి.. పీకలదాకా తాగి…అంత మంది గుమిగూడి చూస్తున్నా
అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన పార్టీ అభ్యర్థుల తరఫున 2019 ఎన్నికల్లో ప్రజలకు ఒక్కొక్క ఓటుకు ఎంత సొమ్ము ఇవ్వబోతున్నారో ఆ రేటును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంచనా వేసి ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ రూపాల్లో అవినీతికి పాల్పడడం ద్వారా చంద్రబాబునాయుడు లక్షల కోట్లు దాచి ఉంచారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 3000 రూపాయల వంతున వెలకట్టి కొనడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యారని వైఎస్ జగన్ ప్రకటించారు.
see also..వైఎస్ జగన్ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?
.ప్రజా సమస్యల కొసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పామాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. చంద్రబాబునాయుడు ప్రతి ఓటుకు 3000 ఇవ్వబోతున్నారు. ఆ సొమ్ము తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ఎలా చెబితే అలా వేయండి. డబ్బుకు అమ్ముడు పోవద్దు.. అలాగని చంద్రబాబు వద్ద తీసుకోకుండానూ ఉండొద్దు. చంద్రబాబు వద్ద ఉన్నదంతా అవినీతి సొమ్మే.. అది ప్రజల సొమ్మే.. ఆ సొమ్ము మీద మీకు హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ మనసు చెప్పినట్లుగా వేయండి.. అని వైఎస్ జగన్ పిలుపు ఇస్తున్నారు.