ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో పాటుగా ఆయన కారులో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా వచ్చారు .
See Also: ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
రావడమే కాకుండా సదరు ఎంపీ ,ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగనున్న హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లి కలిశారు. అంతే కాకుండా అక్కడే ఉన్న బస్సులో ముగ్గురు కలిసి దాదాపు 10 నిమిషాల పాటు చర్చలు జరిపారు .అంతే బాబు అనుకూల మీడియా ఏకంగా ఎంపీ రాయపాటి కారులో రావడంతో ముస్తఫా పార్టీ మారడం ఖాయమని వార్తల మీద వార్తలను ప్రచారం చేశారు,పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ముస్తాపా స్పందిస్తూ కేవలం నియోజక వర్గ అభివృద్ధి కి సంబంధించిన విషయాల గురించి చర్చించాం ..పార్టీ మారను.ప్రాణం ఉన్నంతవరకు జగన్ తోనే నాప్రయాణం అని తేల్చి చెప్పారు.
See Also: కడప నగరంలో సంచలనం ..టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తను ఎందుకు చంద్రబాబును కలవాల్సి వచ్చిందో వివరించడమే కాకుండా టీడీపీ ఎంపీ రాయపాటి వైసీపీలోకి వస్తాను అని చెప్పారు.మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.గత కొంతకాలంగా టీడీపీలో ఎదురవుతున్న అవమానాలే కాకుండా టీటీడీ చైర్మన్ పదవీ అడిగితె ఇవ్వను తేల్చి చెప్పడమే కాకుండా వేరేవాళ్ళను నియమించడం తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీ మారడానికి సిద్ధమని ఆయన తెలిపారు అని జగన్ కు వివరించారు.ఇప్పుడు ఈ వార్త గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.