ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పాలకులు ప్రజలను ఆకర్షించుకోవడానికి, ఆకట్టుకోవడానికి జనాకర్ష పథకాలు అమలు చేస్తూనే వ్యక్తిగతంగా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నానని నమ్మిస్తుంటారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవసరం ఏముందనేగా మీ డౌట్.
ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో అమలు కానీ, మోసపూరిత వాగ్ధానాలు గుప్పించి అధికారం చేపట్టాక, కేంద్రంతో టయ్యప్ అయి ఏపీకి ప్రత్యేక హోదా బదులు… ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి మరీ ప్రజలను నట్టేట ముంచిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే. ఈ నేపథ్యంలో కుఠిల రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు ప్రస్తుతం ప్రజల్లోకి సానుభూతి అనే అస్ర్తాన్ని వదిలేందుకు సిద్ధమయ్యారు.
గత నాలుగేళ్లుగా మోడీ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు సర్కార్ చివరకు.. తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగింని, అందుకు నిరసనగా మా ఎంపీలందరి చేత రాజీనామా చేపించేందుకు నేను సిద్ధమని చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలుకుతున్నారు. ఎన్నికల సమయం మరో ఏడాది మాత్రమే ఉండటంతో ఇప్పటికే అన్ని అవసరాలను సర్దుకున్న ఎంపీలు తమకు ఇక పదవితో ఏం పనిలే అన్న ఆలోచనలో భాగంగా చంద్రబాబు పలుకులకు వత్తాలు పలుకుతున్నారు. ఇలా ఏపీ ప్రజల మనస్తత్వం తెలిసిన చంద్రబాబు సానుభూతి మంత్రాన్ని ఉపయోగించనున్నారు.