రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కే తారకరామరావు విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు కీలక పిలుపు ఇచ్చారు. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ ( క్షమాభిక్ష) నేపథ్యంలో పర్మిట్, వీసా లేకుండా అక్రమంగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని
మంత్రి కేటీఆర్ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వతా కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాబిక్ష అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గతం వారం విజ్ఞప్తి చేసిన మంత్రి, అక్కడి నుండి తిరిగి వస్తున్న వారికి అవసరం అయిన పూర్తి సహకారాన్ని అందించాలని ఎన్నారై శాఖాధికారులను అదేశించారు. ఎన్నారై శాఖ నిరంతరం కువైట్ లోని భారత రాయభార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నదని తెలిపారు.
కువైట్లోని భారత ఎంబసీలో అధికారులతో తెలంగాణ ఎన్నారై శాఖాధికారులు ఈ రోజు మాట్లాడారు. తెలంగాణ కార్మికుల తాలుకు వివరాలను ఎప్పటికప్పుడు ఇక్కడి ఎన్నారై శాధికారులకు అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ విషయంలో అవసరం అయితే దేశ విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ గారి సహాకారం కోరుతామని మంత్రి కే తారక రామరావు తెలిపారు. ఈ క్షమబిక్షలో భాగంగా దేశానికి రావాల్సిన వారు ఇప్పటికే అక్కడి ఎంబసీని కలుస్తున్నారన్నారు. అయితే కొంత మందికి కనీసం విమాన టిక్కెట్టుకు సైతం డబ్బులు లేని పరిస్ధితి తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి, ఇలాంటి వారందరికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందన్నారు. ఈ మేరకు ఎంతమందికి టిక్కెట్లు అవసరం అవుతాయి, తిరిగి వస్తున్న కార్మికుల సంఖ్య ఎంత వంటి వివరాలను తెలుసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు. ఇందుకోసం అవసరం అయిన నిధుల అంచనా సమర్పించాలని, ప్రభుత్వం నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు.
కువైట్ లోని తెలంగాణ పౌరులు ఎవరికైనా అవసరం అయితే వేంటనే తెలంగాణ ఎన్నారై శాఖను సంప్రధించాలన్నారు. దీంతోపాటు సోషల్ మీడియా, మరియు వెబ్‌సైట్ల ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు కావాల్సిన చర్యలను ఒకటి రెండు రోజుల్లో ఎర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు తెలంగాణ ఎన్నారై శాఖకు సంబంధించిన అధికారి మొబైల్ నంబర్ 9440854433ను సంప్రధించడం కానీ శాఖ ఈమెయిల్ so_nri@telangana.gov.in గాని తమ వివరాలు అందించాలన్నారు.