Home / SLIDER / హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్‌

భౌగోళికంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ( సోమవారం) ప్రగతి భవన్‌లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్‌ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులు ఖర్చుచేయాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను కేబీఆర్ పార్క్‌లో మాదిరిగా వాక్ వే రూపొందించాని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలను సందర్శించి అభివృద్ధికి ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు.

see also : బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై

see also : మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!

సేవ్ హైదరాబాద్ లో భాగంగా ఇవన్నీ జరగాలన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని బడ్జెట్ సమావేశాలకు ముందే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రతిపదికగా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రతీ ఏడాది నిధులిచ్చేందుకు బడ్జెట్‌లో ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలకు నేరుగా, ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఆస్థి పన్నుల వసూలు ద్వారా వచ్చే నిధులు సమకూర్చే విధి విధానాలు రూపొందించాలన్నారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏ విధంగా పొందవచ్చో అధ్యయనం చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు సీతారంనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..

see also : ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…

see also : అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat