అండర్ 19 వాల్డ్ కప్ లో ఆసీస్ ను చిత్తు చిత్తుగా ఓడించి.. నాలుగో సారి అండర్ – 19 ప్రపంచ ఛాంపియన్ గా భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత జట్టుకు ప్రసంసలు వెల్లువెత్తున్నాయి.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,సచిన్ టెండూల్కర్..తదితరులు అండర్ -19 టీమ్‌కు అభినందనలు తెలిపారు.ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతున్నారంటూ మొట్టమొదటగా టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ట్వీట్ చేశాడు.ఆ తరువాత మ్యాచ్ లో కుర్రాళ్లు అధ్భుతంగా ఆడారని, కెప్టెన్ పృధ్వీషా, అతని సహచరులను చూస్తుంటే గర్వంగా ఉందని, వారికి అభినందనలు అంటూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ట్వీట్ చేశారు.
Congrats to India's talented young cricket team for winning the Under-19 World Cup. Calmness and composure of our boys embellishes their skills. Proud of captain @Shaw_Prithvi and his mates, as well as of coach Rahul Dravid and the hard-working support staff #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) February 3, 2018
see also : బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!
. యంగ్ క్రికెటర్లు వారి విజయంతో థ్రిల్ చేశారని, అండర్-19 గెలిచినందుకు శుభాకాంక్షలని, ఈ విజయం ప్రతి ఇండియన్ ని గర్వపడేలా చేస్తుందని ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశాడు.
Absolutely thrilled by the stupendous achievement of our young cricketers. Congratulations to them on winning the Under-19 World Cup. This triumph makes every Indian extremely proud.
— Narendra Modi (@narendramodi) February 3, 2018
గొప్ప టీమ్ వర్క్ తో గొప్ప కలలు సాధ్యమౌతాయని, మన వరల్డ్ చాంఫియన్లకు అభినందనలు, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం, రాహల్ ద్రావిడ్, పారిస్ గైడెన్స్ కు పెద్ద కృతజ్ణతలంటూ క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.
WITH GREAT TEAM WORK, BIG DREAMS WORK. Congratulations to our WORLD CHAMPIONS!! We are proud of you. A big congratulations to Rahul and Paras for their guidance. #ICCU19CWC #INDvAUS pic.twitter.com/w0heorY8g6
— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2018
అండర్-19 వరల్డ్ కప్ లో 4వ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు, ఈ గొప్పతనం అంతా కోచ్ రాహుల్ ద్రావిడ్ దే అంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Many Congratulations ? team India ?? U-19 on winning your 4th World Cup. All credit to the young lads & my all time favourite #RahulDravid The wall ?
— KTR (@KTRTRS) February 3, 2018
see also : జగన్‌ని కలిసిన గౌతమ్ రెడ్డి.. వెంటనే వంగవీటికి ఫోన్ చేసిన జగన్..!
కాగా.. అండర్ -19 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరారా ప్రకటించింది. విజేత జట్టు సభ్యులకు రూ. 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన బీసీసీఐ.. కోచ్ ద్రావిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ బృందానికి రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.
see also : టీడీపీ ముఖ్యమైన నాయకుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!