మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ ఆటగాళ్ళలో జోనాధన్ మోర్లో నూట రెండు బంతుల్లో ఆరు పోర్ల సహాయంతో డెబ్బై ఆరు పరుగులు మినహా ఎవరు అంతగా రాణించలేదు.మిగత ఆటగాళ్ళలో ఉప్పల్ ముప్పై నాలుగు ,జాక్ ఇరవై ఎనిమిది నాథన్ మెక్ ఇరవై మూడు పరుగులను సాధించారు.భారత బౌలర్లలో పోరెల్ ,శివ ,నగర్ కోటి ,అనుకూల్ రాయ్ తలా రెండు వికట్లను దక్కించుకున్నారు.
అనంతరం రెండు వందల పదిహేడు పరుగుల లక్ష్యాన్ని టీంఇండియా 38.5 ఓవర్లలో చేదించింది.ఇన్నింగ్స్ ఆరంభంలో పృథ్వీ షా(21) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ మిగతా పనిని మన్‌జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు)లు పూర్తి చేశారు. శుభ్‌మాన్ గిల్(31) ఆకట్టుకున్నాడు.