ఏపీలో కర్నూల్ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు…గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన టిజి వెంకటేష్ మరోసారి పవన్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎంపీల రాజీనామాలు చేయాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా ఆయన పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా మాట్లాడారు.
కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్నతీరుపై గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ పిలుపునిచ్చారని, మరి బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ అంటున్నందున ఇప్పుడు రాజీనామా చేయనున్నారా? అన్న ప్రశ్నకు టీజీ వెంకటేశ్ సమాధానం ఇస్తూ, ‘పవన్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?’ అని వెటకారంగ ఆయన మాట్లడారు.