ఎవరికైనా పెళ్లి అంటే ఆ ఆనందమే వేరు.. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి గురించి వరుడు..వధువులు ఎన్నో కలలు కంటారు.. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని పనులు జరుగుతాయి…. అవి ఎలా ఉంటాయి అంటే జీవితంలో చాల ఇబ్బంది పడేలాగ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఓ కుర్రాడికి ఎదురైంది. పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడి మర్మాంగాన్ని దుండగులు కోసుకెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
see also..లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం
25 ఏళ్ల ఓ యువకుడికి ఫిబ్రవరి 6న ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. గురువారం (ఫిబ్రవరి 1) ఉదయం సదరు యువకుడు సరదాగా స్థానికంగా ఉన్న నదీ తీరానికి వెళ్లిన సమయంలో… ఒంటరిగా ఉన్న అతడిపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేశారు. యువకుణ్ని అపహరించిన దుండగులు చెట్లల్లోకి లాక్కెళ్లి అతడి లైంగిక అవయవాలను కోసేశారు. అనంతరం కోసిసిన మర్మాంగాన్ని తమతోపాటే తీసుకొని పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుణ్ని గమనించిన స్థానికులు.. వెంటనే అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం అతణ్ని ఆసుపత్రికి తరలించారు. కోసేసిన జననావయవాలను దుండగులు తమతో పాటే తీసుకెళ్లడంతో.. శస్త్ర చికిత్స ద్వారా పునరుద్ధరించే వీలు లేకుండాపోయింది. హఠాత్పరిణామంతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కక్షపూరితంగా కావాలనే ఎవరో ఇలా చేశారని అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.