దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి.మరి ముఖ్యంగా జంట నగరాల్లో దారుణంగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో రిపేరు పేరుతో ఇంటికొచ్చిన ఓ మెకానిక్ గృహిణిపై మత్తుమందు చల్లి సెల్‌ఫోన్లో నగ్న చిత్రాలు సేకరించి… తరువాత ఆమెను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన ఓ గృహిణి వాషింగ్ మిషిన్ ఐదు నెలల క్రితం మరమ్మతుకు వచ్చింది. ఆమె ఇంటర్ నెట్ లో వెతికి ..మియాపూర్‌లోని ఓ సర్వీస్ సెంటరును ఫోన్‌లో సంప్రదించింది. యజమానికి బదులు అతని మిత్రుడు పవన్‌తేజ్‌రెడ్డి(24) ఫోన్‌లో మాట్లాడాడు.
see also..లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం
గృహిణి చిరునామాకు వెళ్లి రీపేరు పేరుతో నాలుగైదు రోజులు కాలం వెళ్లదీశాడు. యంత్రం బాగుచేసేందుకు అవసరమైన వస్తువులను తెప్పించాలని చెప్పి వారం తర్వాత తిరిగివచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ముఖంపై మత్తుమందు చల్లాడు. స్పృహ కోల్పోయిన ఆమెను వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రాలు తీశాడు. అనంతరం ఆ చిత్రాలు చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తరవాత కూడా ఆఘాయిత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. రూ.35 వేలు సైతం తీసుకున్నాడు. నెల క్రితం ఆమె నగ్న చిత్రాలను మిత్రులకు చూపించాడని ఆ మహిళకు తెలిసింది. ఇక ఆగడాలతో విసిగిన ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గత నెల 19న పవన్‌తేజ్‌రెడ్డిని అరెస్టు చేశారు.